
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఇప్పటికి వణికిస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు అనేక దేశాలు ప్రయోగాలు మొదలు పెట్టాయి. ఎట్టకేలకు కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్‌ను అన్ని దేశాల్లో.విజయవంతంగా తయారు చేశారు. వ్యాక్సిన్ తయారు కావడంతో అనేక దేశాలు ప్రజలకు వ్యాక్సినేషన్ ఇవ్వటం మొదలు పెట్టారు. అందులో భారత్ దేశం కూడా ఒకటి. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పట్టింది. కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే అందరికి కరోనా వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు ముమ్మరం చేసింది.మన దేశంలో కరోనా వ్యాక్సిన్ అందండం గర్వపడాల్సిన విషయం. ప్రతి రాష్ట్రానికి కావలసి సంఖ్యలో ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ డోస్‌లను పంపింది. కరోనా వ్యాక్సిన్ పంపీణీ విజయవంతం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా భారత్‌లోనే తయారయిన టీకాలు ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ చూపించడం లేదని అంటున్నారు.
మరి కొన్ని నెలల్లోనే దేశంలోని ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్స్‌న్ టీకాలు వేయనున్నారు. కనివిని ఎరుగని స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీ నుంచి రెండవ విడత వ్యాక్సినేషన్ మొదలు అయింది. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీయర్ నటి రాధిక శరత్ కుమార్ ఈ రోజు కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకున్నారు. ఈ మేరకు రాధికా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు మీ ఆప్తులను కూడా కాపాడుకునేందుకు కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకోండి అంటూ నటి రాధిక ట్వీట్ ద్వారా తెలిపారు. తాజాగా నేడు కరోనా వ్యాక్సిన్ అందుకున్న సీనియర్ నటి రాధికా శరత్ కుమార్.
#vaccine taken. Please protect yourself and loved ones go get vaccinated. Follow all safety norms 🙏🙏 pic.twitter.com/NdHMoGzaIk
— Radikaa Sarathkumar (@realradikaa) March 2, 2021