కౌన్సిలింగ్ కు హాజరు అవ్వని షణ్ముఖ్.. ఎందుకంటే…!?

March 5, 2021 at 3:27 pm
shanmukh

సోషల్ మీడియా స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. తన వెబ్ సీరీస్, కవరింగ్ సాంగ్స్ తో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. షణ్ముక్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలంటూ నోటిసులు ఇచ్చారు. అయితే పోలీసులు ఇచ్చిన ఆదేశాలను షణ్ముక్ జస్వంత్ పట్టించుకోకుండా.. కౌన్సిలింగ్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది. దీనితో జస్వంత్‌పై కోర్టు ప్రొసీడింగ్స్‌కు జూబ్లి హిల్స్ పోలీసులు సిద్దమవుతున్నట్లు సమాచారం.

కాగా, హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌రు 10లో యూట్యూబ్ ఫేమ్‌, టిక్‌టాక్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ తప్పతాగి రెండు కార్లు, రెండు బైక్‌ల‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. షణ్ముఖ్‌ జశ్వంత్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా.. 170 రీడింగ్ వచ్చింది. ఐపీసీ సెక్షన్ 337, 279 కింద పోలీసులు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసిన విషయం విదితమే.

ఇదిలా ఉంటే, షణ్ముఖ్‌ జస్వంత్ ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అటు ‘సూర్య’ అనే మరో వెబ్ సిరీస్‌ను షణ్ముఖ్‌ జస్వంత్ ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీస్‌లు కోట్లలో వ్యూస్ రాబడుతున్నాయి. షణ్ముఖ్‌ జశ్వంత్ కెరీర్ విషయానికి వస్తే.. ‘వైవా’ అనే షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత పలు డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్‌తో మంచి ఆదరణ పొందాడు. ఇటీవల షణ్ముఖ్ నటించిన ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ఇక తాజాగా షణ్ముఖ్ ‘సూర్య’ అనే మరో వెబ్ సిరీస్‌ చేస్తున్నాడు.

కౌన్సిలింగ్ కు హాజరు అవ్వని షణ్ముఖ్.. ఎందుకంటే…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts