ప్రయాణికులకు షాక్: ప్లాట్ ఫాం టికెట్స్ పై పెరిగిన ధర..!?

March 5, 2021 at 4:33 pm
railway-platform

తాజాగా రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను భారీగా పెంచుతూ ప్రకటన జారీ చేసింది. కానీ ప్రస్తుతం పెరుగుతున్న అన్నిరకాల ధరలను చూస్తుంటే మాత్రం తినకుండానే ఆకలి తీరిపోతుందట. ఇప్పటికే పెట్రోల్, డిజిల్, నిత్యవసరాలు, ట్రావెల్ చార్జీలు అంటూ మనిషిని బ్రతికించేవి, నడిపించేవి ఎన్ని ఉన్నాయో అన్నీటి ధరలు కొండెక్కి కూర్చున్నాయి.ఇక ప్రస్తుతం దేశంలోని అన్ని రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది.

అయితే ఇప్పటిదాక రూ.10గా ఉన్న ప్లాట్‌ఫాం ధర రూ.30కి చేరింది.అంటే ఒకేసారి రైల్వేశాఖ రూ.20 పెంచింది అన్నమాట.ఇదే కాకుండా లోక‌ల్ రైళ్ల టికెట్ల‌ను కూడా భారీగా పెంచిన రైల్వే శాఖ క‌నీస చార్జీ రూ.30గా నిర్ణ‌యించింది.కాగా పెంచిన ధ‌ర‌ల‌ను వెంట‌నే అమ‌ల్లోకి తీసుకురావాల‌ని అన్ని జోన్ల‌నూ ఆదేశించింది. ఇకపోతే ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న వారు రెండు గంట‌ల వరకు ప్లాట్‌ఫామ్‌పై ఉండ‌వ‌చ్చని తెలిపింది.

ప్రయాణికులకు షాక్: ప్లాట్ ఫాం టికెట్స్ పై పెరిగిన ధర..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts