
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ షినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అయితే తాజాగా ప్రభాస్‌తో కలిసి పనిచేయడంపై శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రుతి మాట్లాడుతూ `ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొన్నాను.
నాది చాలా విభిన్నమైన పాత్ర. అలాగే ప్రభాస్‌తో తొలిసారి కలిసి పనిచేస్తుండడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయన చాలా మంచి వ్యక్తి. తాము నిరాడంబరంగా ఉంటున్నట్టు చూపించుకోవడానికి కొందరు నటిస్తుంటారు. కానీ, ప్రభాస్ అలాంటి వ్యక్తి కాదు. ప్రభాస్ సహజంగానే నిరాడంబరమైన వ్యక్తి. సెట్లో అందరితోనూ కలిసిపోతార` అని చెప్పుకొచ్చింది.