
టాలీవుడ్ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని మరోసారి వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది సునీత.. వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా సునీత కల్లు తాగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రపంచ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఒక టీవీ చానల్ వాళ్లు ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం సునీత ఆహ్వానించారు.
హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్టులో ఆ కార్యక్రమం జరగింది. అయితే ఆ రిసార్ట్ లో తాటిచెట్లు ఉండడం.. అప్పుడే కార్మికులు కల్లు తీయడంతో ఆ కల్లును తోటి ఆర్టిస్టులతో కలిసి సునీత అలా కొద్దిగా సరదాగా సిప్ చేసింది. అంతేకాదు, ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.