మహిళలకు ఎస్బిఐ బంపర్ ఆఫర్…!?

March 8, 2021 at 2:32 pm

ఉమెన్స్ డే సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్త చెప్పింది. ప్రతీ ఒక్కరికి సొంతింటి కలని నిజం చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఇచ్చింది. మహిళా దినోత్సవ వేళ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ మహిళలకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తీసుకునే మహిళలకు వడ్డీ రేట్లను 5 బేసిక్ పాయింట్లు తగ్గించనున్నట్లు ఎస్బీఐ తెలిపింది.ఇలా చేయడం వలన వారికి 6.70 ప్రారంభ వడ్డీ రేట్ల తో హోమ్ లోన్స్ ఇస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది.

అయితే ఈ ప్రత్యేక ఆఫర్ ని మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు అందించనున్నట్లు తెలిపింది ఎస్బీఐ. ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అంటూ బ్యాంక్ వారు చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రముఖులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తదితర ప్రముఖులు అందరు శుభాకాంక్షలు తెలిపారు. అలానే దేశం లో మహిళలు అనేక రంగాల్లో అనేక రికార్డులు నెలకొల్పారని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాల్ని గుర్తించి వాళ్ళని ప్రశంసించడమే ఈ సారి థీమ్.

మహిళలకు ఎస్బిఐ బంపర్ ఆఫర్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts