
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై గాజులపల్లి సుధీర్‌బాబు సమర్పణలో బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. నేటి సాయంత్రం సినిమా టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ అనే టైటిల్ ను ఖారారు చేశారు.
ఈ ఇంట్రస్టింగ్ టైటిల్‌నే ఈ రోజు సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. కాగా, సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. దీంతో ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.