ఐటీ దాడులపై పెదవి విప్పిన తాప్సీ…!?

March 6, 2021 at 1:59 pm

తన ఇంటి పై ఆదాయపన్ను శాఖ ఐటీ అధికారుల సోదాలు జరపడం పై తాజాగా ప్రముఖ నటి తాప్సీ మొట్ట మొదటిసారిగా నోరు విప్పారు. గత మూడు రోజులుగా వెలుగు చూసిన అనేక పరిణామాల పై ఆమె ట్విటర్‌ ద్వారా స్పందించారు. గడిచిన మూడు రోజుల నుంచి ఐటీ అధికారులు తన ఇంటిలో ఏం సోదా చేశారో తాప్సీ తెలిపారు.. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం ఐటీ అధికారులు వెతికారని, కానీ తనకు అక్కడ ఎలాంటి ఇల్లు లేదని చెప్పారు తాప్సీ. అలానే తాను ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం తనిఖీ చేసారు కానీ తానెప్పుడూ అంత మొత్తాన్ని తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లు 2013లో తన ఇంటిలో ఐటీ సోదాలు జరిగిన సంగతి తనకు అసలు గుర్తులేదంటూ తాప్సీ ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చారు.

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీతో పాటు పలువురు నివాసాల్లో ఇటీవలే ఐటీ సోదాలు జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈ తనిఖీలపై స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేను ఎవరి పై ఎలాంటి కామెంట్‌ చేయాలని అనుకోవటం లేదు. 2013 సంవత్సరంలో కూడా వాళ్ల నివాసం పై ఐటీ దాడులు జరిగాయి. ఆ టైములో పెద్దగా పట్టించుకోని ఈ సమస్యను ఇప్పుడెందుకు ఇంత పెద్ద విషయంగా చూస్తున్నారు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. వీటి పై నటి తాప్సీ తాజాగా స్పందించారు. ఈ మధ్య గత కొద్దీ రోజులుగా వెలుగు చూసిన ఈ పరిణామాలపై ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు.

ఐటీ దాడులపై పెదవి విప్పిన తాప్సీ…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts