ఆ సీనియ‌ర్ హీరోయిన్ బ‌యోపిక్‌లో త‌మ‌న్నా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

March 7, 2021 at 11:49 am

ఇటీవ‌ల కాలంలో బయోపిక్‌ల పర్వం నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాష‌ల్లోనూ వ‌రుస బ‌యోపిక్‌ల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ఇప్ప‌టికే ఎన్టీఆర్, మహానటి సావిత్రి, వైఎస్ఆర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, సిల్క్ స్మిత వంటి ప్ర‌ముఖుల బ‌యోపిక్‌లు రాగా.. ఇప్పుడు మ‌రో లెజెండ‌రీ హీరోయిన్ బ‌యోపిక్ తెర‌పైకి వ‌చ్చింది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు సీనియర్ నటి జమున గారు. ఈ బ‌యోపిక్‌ను శివనాగు నర్రా దర్శకత్వం వ‌హించ‌నున్నారు. ఆయన ఇప్పటికే స్క్రిప్టు సిద్ధం చేశారట. ఈ చిత్రంలో జ‌మున‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం త‌మ‌న్నాతో చిత్ర యూనిట్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. ఇక త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని తెలుస్తోంది. కాగా, త‌మ‌న్నా న‌టించిన తాజా చిత్రం సీటీమార్ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. గోపీచంద్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఆ సీనియ‌ర్ హీరోయిన్ బ‌యోపిక్‌లో త‌మ‌న్నా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts