చంద్రబాబుకు మ‌రో ఊహించ‌ని షాక్‌.. సిఐడి పిలుపు

March 16, 2021 at 10:34 am

ఇటీవ‌ల జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక‌సంస్థ‌ల, మున్నిప‌ల్ ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్న‌ది టీడీపీ, త‌న సొంత జిల్లాలోనూ పార్టీ ఊడ్చుపెట్టుకుపోయింది. ఒక్క కారొ్ప‌రేష‌న్ ను కూడా ద‌క్కించుకోలేని దుస్థితి. 75 మున్సిపాల్టీల్లో కేవ‌లం 1 మాత్ర‌మే ద‌క్కించుకున్న‌ది. ఇది పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ ఇవ్వ‌గా, ఒక ద‌శ‌లో ఆయ‌న ప్ర‌జ‌ల‌పైనే సీరియ‌స్ అయ్యారు. సిగ్గు, శ‌రం ఉందా? అంటూ జ‌నంపై రంకెలు వేశారు. ఆ ఘోర ప‌రాభ‌వం నుంచి తేరుకోక‌ముందే బాబుకు మ‌రో షాక్ త‌గిలింది. అమ‌రావ‌తి భూకుంభ‌కోణానికి సంబంధించి సీఐడీ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేయ‌డం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపుతున్న‌ది.

అమరావతిలో రాజ‌ధాని నిర్మాణానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వేలాది ఎక‌రాల‌ను రైతుల నుంచి సేక‌రించింది. అందులో సుమారు 500ఎకరాల భూకుంభకోణం జ‌రిగింద‌ని విమ‌ర్శ‌లున్నాయి. ఇదే విష‌యాన్ని ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ ఏర్పాటు చేసిన మంత్రుల హైపవర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ వెల్ల‌డించింది. జధాని భూముల్లో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయార‌ని, దాదాపూ 47.39 ఎకరాల భూముల్ని కొల్లి శివరామ్ అనే వ్యక్తికి ఇచ్చారంటూ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇలా శివరామ్ తో పాటూ ఎవరికి! ఎన్ని ఎకరాల భూముల్ని కట్టబెట్టారనే విషయాల్ని స్పష్టం చేస్తూ ఓ రిపోర్ట్ ను తయారు చేసినట్లు సమాచారం. హైప‌వ‌ర్ క‌మిటీ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేశారు. అందులో భాగంగా హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి సిఐడి అధికారులు రెండు బృందాలుగా వెళ్లారు. విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందిగా 41 సీఆర్పీసీ కింద సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఇక ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతిలాద్ దండేకు 160సీఆర్పీసీ నోటీసులు జారీ చేసిన‌ట్లు అధికారులు వెల్డించారు.

చంద్రబాబుకు మ‌రో ఊహించ‌ని షాక్‌.. సిఐడి పిలుపు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts