`బట్టల రామస్వామి బయోపిక్కు` టీజర్ రీలీజ్ ..!?

March 5, 2021 at 4:26 pm
Battala-Ramaswamy-Biopikku

తీసేవాడు ఉండాలే కానీ ప్రతివాడి బతుకు ఒక బయోపిక్కే` అంటూ వచ్చిన `బట్టల రామస్వామి బయోపిక్కు` టీజర్ ఆకట్టుకుంటోంది. నూతన నటీనటులు ఆల్తాఫ్‌ హాసన్‌, శాంతిరావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సతీష్‌కుమార్‌, రామకృష్ణ వీరపనేని నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

జీవిత చరిత్రలు పెద్దపెద్ద నాయకులు, సినీ ప్రముఖులకే కాదండి.. మీలాంటి, నాలాంటి మామూలు మనుషులకు కూడా ఉంటాయి.’ అనే డైలాగ్‌తో ఆరంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. ‘తీసేవాడు ఉండాలే కానీ ప్రతివాడి బతుకు ఒక బయోపిక్కే’, ‘ప్రతి కథలోనూ ట్విస్టులు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ వీడి విషయానికి వచ్చే సరికి ట్విస్టుల్లోనే కథ ఉంటుంది’ అనే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

`బట్టల రామస్వామి బయోపిక్కు` టీజర్ రీలీజ్ ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts