ఉమెన్స్ డే స్పెష‌ల్‌..అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన ప‌వ‌న్‌!

March 8, 2021 at 12:20 pm

ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన `ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే`ను ఘ‌నంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఉమెన్స్ డే సంద‌ర్భంగా ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేస్తున్న సినిమాల్లో `వ‌కీల్ సాబ్‌` ఒక‌టి. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అయితే నేడు ఉమెన్స్ డే సంద‌ర్భంగా.. ఈ సినిమా నుంచి ఓ స్పెష‌ల్ పోస్టర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. పవన్‌తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన అంజలి, నివేదా థామస్, అనన్యా నాగెళ్లను ఈ పోస్టర్‌లో చూపిస్తూ.. ఉమెన్స్ డే విషెస్ తెలిపారు.

ప్ర‌స్తుతం ఈ పోస్ట్ తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు వ‌కీల్ సాబ్ రీమేక్‌గా తెర‌కెక్కుతోంది.

Image

ఉమెన్స్ డే స్పెష‌ల్‌..అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన ప‌వ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts