
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తాజా చిత్రం `జాతిరత్నాలు`. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. స్వప్న సినిమాస్ పతకంపై ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తుండడం విశేషం.
మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయడంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగుతున్నాడు.
శనివారం సాయంత్రం వరంగల్‌లో 6 గంటలకు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా విజయ్ దేవరకొండ రాబోతున్నట్టు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ఫన్నీ అండ్ క్రియేటివ్ పోస్టర్ ను విడుదల చేశారు.