
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాజా చిత్రం `విక్రమార్కుడు`. ది రియల్ డాన్ అన్నది ట్యాగ్ లైన్. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఆర్.కె.వి.కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన పతాకాలపై కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మార్చి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్విహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. `ఎప్పుడూ మిగతా వాళ్లను కిందకు దించేసి మనం పైకి రావాలనుకోవడం తప్పు.. మనం పైకి వచ్చిన తర్వాత ప్లేస్ లేదు కొంచెం కిందకి దిగండి అని నాజూగా చెబితే వాళ్లే దిగిపోతారు` అంటూ విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది.
నవరసాలు ఉన్న మంచి ఎంటర్ టైన్మెంట్ మరియు యాక్షన్ చిత్రమని ట్రైలర్ బట్టీ అర్థం అవుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి లుక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తానికి తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.