జ‌గ‌న్ ఆమంచికి అంత ప్ర‌యార్టీ వెన‌క క‌థేంటి ?

March 3, 2021 at 11:07 am

ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే యువ నాయ‌కుడు.. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ గురించి తాజాగా సోష‌ల్ మీడియాలో పార్టీ మార్పు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌కు వైసీపీలో ప్రియార్టీ త‌గ్గింద‌ని, సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని.. ఈ నేప‌థ్యంలోనే ఆమంచి మ‌న‌స్తాపంతో ఉన్నార‌ని. దీనిని సాకుగా చూపించి.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆయ‌న‌కు గేలం వేస్తోందని వార్తలు వ‌స్తున్నాయి. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మ‌మ్మ‌ల్ని తిడితే తిట్టావు.. ఇప్పుడు వ‌చ్చేసెయ్‌! అని టీడీపీ అధినేత నుంచి కూడా వ‌ర్త‌మానాలు వ‌స్తున్నాయ‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

అయితే.. వీటిలో నిజం ఎంత‌? ఆమంచికి నిజంగానే వైసీపీలో అన్యాయం జ‌రిగిందా ? సీఎం జ‌గ‌న్ కానీ, వైసీపీ కీల‌క నేత‌లు కానీ.. ఆమంచిని దూరం పెట్టారా ? అంటే.. కాద‌నే ఆన్స‌రే వ‌స్తోంది. ఈ ప్ర‌చారం వెన‌క సొంత పార్టీలోనే ఆయ‌న్ను టార్గెట్ చేసే నేతలే ఉన్నార‌ని తెలుస్తోంది. ఆమంచి కృష్ణ మోహ‌న్‌.. వైసీపీ తీర్థం పుచ్చుకుని ప‌ట్టుమ‌ని రెండేళ్లు అయింది. ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో చీరాల టికెట్ ఇచ్చినా స్థానిక స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఆమంచి ఓడిపోయారు. క‌ర‌ణం బ‌ల‌రాంను సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో ప‌నికి వస్తాడ‌నే జ‌గ‌న్ ఆయ‌న పార్టీకి సానుభూతిప‌రుడిగా ఉండేందుకు ఓకే చెప్పారు.

క‌ర‌ణం టీడీపీలోకి వ‌చ్చినా జ‌గ‌న్ ఆమంచిని ప‌క్క‌న పెట్ట‌లేదు. ఆయ‌న చీరాల ఇన్‌చార్జ్ ప‌ద‌విని అలాగే ఉంచేశారు. త‌న‌ను న‌మ్ముకుని పార్టీ మారి వ‌చ్చి పోటీ చేశారు.. ఏదైనా కార‌ణంగా ఓడిపోయినా ఆమంచి నెత్తిన జ‌గ‌న్ ఇంకా పెద్ద బాధ్య‌త‌లే పెడుతూ వ‌చ్చారు. క‌ర‌ణం వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యాక చీరాల వైసీపీ రాజ‌కీయం కిచిడీ అయిపోయింది. ఆమంచి చాలా డిస్ట‌ర్బ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆమంచికి ఇటీవ‌ల ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఎంతో మంది సీనియ‌ర్ల‌ను కూడా ప‌క్క‌న పెట్టి ఆమంచికి రెడ్ కార్పెట్ వేయాల‌ని అనుకున్నారు. వ‌చ్చే జూన్‌లో ఆమంచికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వ‌డం దాదాపు ఖ‌రారైంది.

జ‌గ‌న్ ఆమంచిని వ‌దులుకుని చీరాల‌లో పార్టీని ప‌ణంగా పెడ‌తార‌న్న‌ది అవాస్త‌వం. ఎవ‌రిని పూర్తిగా న‌మ్మాలో ? ఎవ‌రు ఎవ‌రి అవ‌స‌రాల కోసం రాజ‌కీయం చేస్తున్నారో జ‌గ‌న్‌కు తెలియంది కాదు. అందుకే ఆమంచిని ఎమ్మెల్సీని చేసి 2024 ఎన్నిక‌ల టార్గెట్‌గా త‌న స్ట్రాట‌జీలో తాను ఉండాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, మ‌రో రీజ‌న్ చూస్తే ప్ర‌కాశం జిల్లా లాంటి చోట్ల‌ కాపు సామాజిక వ‌ర్గాన్ని చేరువ చేసుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో కాపు సామాజిక వ‌ర్గానికే చెందిన ఆమంచి.. యాక్టివ్‌గా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఎలా వ‌దులుకుంటారు.

మ‌రో కీల‌క విష‌యం.. ఒక వేళ‌.. చీరాల‌ను క‌ర‌ణంకు తాత్కాలికంగా మాత్ర‌మే ఇవ్వాల‌ని జ‌గ‌న్ అనుకున్నా.. ఆల్ట‌ర్‌నేట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా వెంట‌నే చూపించారు. ఆమంచి ఇష్ట‌ప‌డితేనే ప‌రుచూరును ఆయ‌న‌కు ఇస్తామ‌ని.. ఇప్ప‌టికే చెప్పారు. ఇలా.. ఆమంచిని వ‌దులు కోకుండా.. ఆయ‌న‌ నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించేందుకు జ‌గ‌న్ ఇన్ని చ‌ర్య‌లు చేప‌డుతుంటే.. అస‌లు ఉంటుందో. ఉండ‌దో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అని భావిస్తున్న‌ టీడీపీలోకి ఆమంచి వెళుతున్నార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారం వెన‌క ఆ పార్టీలోనే కొంద‌రు నేత‌లు ఉన్న‌ట్టు భోగ‌ట్టా ?

జ‌గ‌న్ ఆమంచికి అంత ప్ర‌యార్టీ వెన‌క క‌థేంటి ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts