వైరల్ వీడియో :తన బిడ్డతో విధులు నిర్వహిస్తున్న మహిళ పోలీస్…ఎక్కడంటే ..!?

March 8, 2021 at 2:03 pm

సాధార‌ణంగా మ‌హిళ‌లు అప్పుడప్పుడు కొన్ని సమయలో త‌మ పిల్ల‌ల‌ను కూడా త‌మ‌తో పాటు తాము ప‌ని చేసే చోటుకు తీసుకువెళ్తుంటారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అలాగే ఒక మ‌హిళా ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కూడా త‌న చంటి బిడ్డ‌తో డ్యూటీకి వెళ్ళింది. ర‌హ‌దారి వ‌ద్ద ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌గా తన విధులు నిర్వ‌హించింది. అయితే ఆమెను చూసిన చాలా మంది విచారం తెలియ పరుస్తున్నారు.

చండీగ‌ఢ్‌లోని సెక్టార్ 15/23లో ప్రియాంక అనే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ తన చంటి బిడ్డ‌ను ఎత్తుకుని ర‌హ‌దారి పై, దుమ్ములో విధి నిర్వహిస్తుడటం చూసి కొంద‌రు వీడియో తీశారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెకు ఫీల్డ్ డ్యూటీ వేసిన పోలీసు ఉన్న‌తాధికారుల పై కొన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆమెకు డెస్క్ జాబ్ ఇవ్వచ్చు కదా అని, అలాగే ఆమె బిడ్డ‌కు ఉచితంగా క్రెచ్ లేదా డే కేర్ స‌దుపాయాన్ని కూడా వారు అందించి ఉండాల్సింది అంటూ తమ అభిప్రాయం వ్వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియో :తన బిడ్డతో విధులు నిర్వహిస్తున్న మహిళ పోలీస్…ఎక్కడంటే ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts