సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాలయ్య ” అఖండ”..!

 

 

 

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంకా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ మూవీస్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రం పై అభిమానుల‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఉగాది పండుగ సందర్భంగా బీబీ3 టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి టైటిల్ అఖండ అని ఖరారు చేశారు.

టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన సంగీతంఅందరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా బాలయ్య మూవీ టీజర్ వచ్చి రాగానే ఫుల్ వైరల్ అయిపోయింది. వ్యూస్ తో పాటు లైక్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ సాధించి, ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది బాలయ్య అఖండ టీజర్.

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/gJZQ_YFkUdY” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>