నటుడు సతీదార్ మృతి..!

కరోనా మహమ్మారి మరో సినీ నటుడిని బలి తీసుకుంది. జాతీయ అవార్డు మూవీ కోర్టు నటుడు వీరా సతీదార్ కరోనా బారి పడి చివరికి మృతిచెందారు. ఇటీవల కరోనా వైరస్‌ ‌బారిన పడిన ఆయన గత రెండు రోజులుగా వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో చనిపోయారని రచయిత, దర్శకుడు చైతన్య తమ్హానే ప్రకటించారు. ఈ చేదు వార్త ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ సతీదార్‌ మరణం పై ఆయన సంతాపం తెలిపారు. అలాగే పలువురు ఉద్యమ కార్యకర్తలు, ఇతర సినీ రంగ ప్రముఖులు సతీదార్ మృతి పై సంతాపం వ్యక్తం చేసారు.

కాగా చైతన్య దర్శకత్వంలో వచ్చిన కోర్టు చిత్రంలో కవి, ఉద్యమకారుడు నారాయణ కాంబ్లే పాత్రలో సతీదార్‌ ఎందరో ప్రశంసలందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ సినిమా పలు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. అలాగే అస్కార్‌ అవార్డుల బరిలో కూడా ఎంట్రీ ఇచ్చింది. సతీదార్ మహారాష్ట్రలోని అంబేడ్కర్‌ ఉద్యమంలో ముఖ్య నేతగా ఉన్నారు .అలాగే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ కన్వీనర్‌గా సతీదార్ ఉన్నారు.

#ViraSathidar, the activist poet in #ChaitanyaTamhane’s #Court (he was a poet and activist in real life as well) has died due to Covid. In his honor we should all watch #Court again. pic.twitter.com/whM9RQgrbI
— Aseem Chhabra (@chhabs) April 13, 2021