మూవీ టైటిల్ చెబుతావా చెప్పవా అంటూ బాలీవుడ్ నటుడు డైరెక్టర్‌ను అడిగాడు. దానితో ఆ డైరెక్టర్ నేను చెప్పను అనటంతో, కోపంతో ఊగిపోయిన ఆ నటుడు ఒక్కసారి డైరెక్టర్‌ను గొంతు పట్టుకుని పైకి ఎత్తి కుదేశాడు. అంతే కాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కూడా చేశాడు. ఆ నటుడి సిద్ధాంత్ చతుర్వేది ఇంకా ఆ డైరెక్టర్ శకున్ బాత్రా. కానీ ఇదంతా ఎదో సీరియస్‌గా జరిగిన వ్యవహారం అనుకుంటే పొరపాటే. ఏదో సరదాగా చేసిన ప్రయత్నం.
ఈ వీడియోను సిద్ధాంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, మరోసారి విఫలయత్నం చేశాను. అప్పటి దాకా ఈ మూవీని శకున్ బాత్రా నెక్స్ట్ మూవీ అని చెప్పుకోవాల్సిందే అంటూ కామెంట్ చేశాడు. ఈ మూవీలో సిద్ధాంత్ సరసన నటిస్తున్న కత్రినా కైఫ్ కూడా ఈ సరదా వీడియో పై స్పందించి, అయ్యో సిద్ధాంత్ ఫ్యాన్స్ కూడా మూవీ టైటిల్ చెప్పమని డిమాండ్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేసింది. ఇంకా ఈ మూవీలో దీపికా పదుకోన్, అనన్యా పాండే కూడా నటిస్తున్నారు.