జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‏గా మహానటి..!

April 19, 2021 at 1:03 pm

మహానటి చిత్రంతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‏లో వరుస మూవీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది.తాజాగా కీర్తి సురేష్ ఆభరణాల విక్రయ సంస్థ అయిన జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‏గా మారింది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి ఈ సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ అయ్యేలా చేస్తుందని ఆ సంస్థ ఆశిస్తోంది.

ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో కొత్త షోరూంలను ప్రారంభిస్తామని జోస్‌ ఆలుక్కాస్‌ ఒక ప్రకటనలో చెప్పింది. తమ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కీర్తి సురేష్‌ సేవలు దీర్ఘకాలం కొనసాగాలని సంస్థ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పింది. జోస్‌ ఆలుక్కాస్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులుకావడం గర్వకారణమని కీర్తి అన్నారు. ఇటీవల నితిన్ సరసన రంగ్ దే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి. ఈ మూవీ బాక్సాపీస్ దగ్గర మంచి హిట్ టాక్ సొంతం చేసుకోగా, ప్రస్తుతం కీర్తి మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట మూవీలో నటిస్తోంది.

 

జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‏గా మహానటి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts