వైరల్ అవుతున్న సీనియర్ నటి న్యూ లుక్ పిక్స్..!

April 29, 2021 at 2:14 pm

సీనియర్ నటి రాధిక శరత్‌ శరత్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా హెయిర్‌ కట్‌ చేసుకుని న్యూ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన పిక్స్ రాధికా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, ఈ న్యూ లుక్‌ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానంటూ చెప్పారు. మొన్నటి వరకు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు తన మేక్‌ఓవర్‌ పై దృష్టి పెట్టినట్లు ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న అనంతరం రాధిక ఆరోగ్యం పై పలు పుకార్లు వచ్చాయి. వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఆమెకు కరోనా సోకిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీని పై స్వయంగా స్పందించిన రాధిక, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని పేర్కొంది. తనకు కరోనా లేదని, కానీ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత కాస్త బాడీ పెయిన్స్ వచ్చాయని రాధికా క్లారిటీ ఇచ్చింది.

 

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Cheering myself up ,hope u all like the look😄😄😄😄 <a href=”https://t.co/M5XCMu4cgi”>pic.twitter.com/M5XCMu4cgi</a></p>&mdash; Radikaa Sarathkumar (@realradikaa) <a href=”https://twitter.com/realradikaa/status/1387401298727690245?ref_src=twsrc%5Etfw”>April 28, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

వైరల్ అవుతున్న సీనియర్ నటి న్యూ లుక్ పిక్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts