మ‌రోసారి త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించిన ఆర్ఆర్ఆర్ న‌టుడు..!

April 29, 2021 at 12:46 pm

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌ల‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. దీనితో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యే ప్రజల సంఖ్య బాగా పెరుగుతుంది. కానీ ప‌డ‌క గ‌ద‌లు సరిపోక‌, ఆక్సిజ‌న్స్ అందుబాటులో లేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల‌ని గ‌మ‌నిస్తున్న సినీ సెల‌బ్రిటీలు అంతా త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. తాజ‌గా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ బృహన్‌ముంబయి కార్పొరేషన్‌ బీఎంసీ తో చేతులు కలిపారు.

అజయ్ దేవ‌గ‌ణ్ త‌న ఎన్‌వై ఫౌండేష‌న్స్ ద్వారా ముంబైలోని శివాజీ పార్క్‌లో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు సాయం అందించారు. శివాజీ పార్క్‌లోని వివాహ వేదిక‌ల‌ను కోవిడ్ కేంద్రాలుగా మార్చేసి, 20 ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు వెంటిలేట‌ర్స్, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్, ఇత‌ర వైద్య సేవ‌ల‌ను  ప్రజలకి  అందుబాటులో ఉంచారు.

మ‌రోసారి త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించిన ఆర్ఆర్ఆర్ న‌టుడు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts