‘ఆర్.ఎక్స్ 100’ దర్శకుడుతో అఖిల్ సినిమా..!?

April 19, 2021 at 1:29 pm

అక్కినేని అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని ఉగాది పండుగ సందర్బంగా ప్రకటించారు. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రానికి ఏజెంట్ అనే పేరు పెట్టారు.

ఏజెంట్ గా అఖిల్ మాస్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ఏమిటనే దాని పై కూడా అప్డేట్ వచ్చిందంటున్నారు. వరుస హిట్స్ కొడుతున్న మైత్రి మూవీస్ సంస్థలో మూవీ చేయటానికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆర్.ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన కథ అఖిల్ కి బాగా నచ్చిందట. కాబ్బటి తొందర్లోనే అఖిల్, అజయ్ భూపతి సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తుంది.

‘ఆర్.ఎక్స్ 100’ దర్శకుడుతో అఖిల్ సినిమా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts