మరోసారి మానవత్వం చాటుకున్న బాలీవుడ్ హీరో..!?

బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్ష‌య్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా స్టార్ హీరోనే. ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న వంతు సాయం చేస్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు అక్షయ్. గ‌త సంవత్సరం క‌రోనా విజృంభిస్తున్న టైములో భారీ విరాళాలు అందించిన అక్ష‌య్ కుమార్ ఇప్పుడు తాజాగా క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం పాటు పడుతున్న మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ‌కు రూ. కోటి విరాళంగా ఇచ్చారు.

త‌న స్వ‌చ్చంధ సంస్థ‌కు అక్ష‌య్ కోటి రూపాయ‌లు విరాళం ఇవ్వ‌డం పై హర్షం వ్య‌క్తం చేసిన గంభీర్ అత‌నికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. అక్ష‌య్ ఇచ్చిన డ‌బ్బును మా ఫౌండేష‌న్ ద్వారా ఆక్సీజన్, ఫుడ్ ,మెడిసిన్ వంటి వాటిని అవ‌ర‌స‌ర‌మైన వారికి ఉపయోగిస్తామని ఆయన అన్నారు. గంభీర్ ట్వీట్‌ పై కూడా అక్ష‌య్ స్పందిస్తూ,క‌ఠిన‌మైన ఈ స‌మ‌యంలో నా వంతు సాయం చేయ‌డం నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఈ సంక్షోభం నుండి త్వ‌ర‌లోనే అందరం బ‌య‌ట‌ప‌డ‌తాం అని ఆశిస్తున్నాను అంటూ అక్ష‌య్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Every help in this gloom comes as a ray of hope. Thanks a lot @akshaykumar for committing Rs 1 crore to #GGF for food, meds and oxygen for the needy! God bless ?? #InThisTogether @ggf_india
— Gautam Gambhir (@GautamGambhir) April 24, 2021