`పుష్ప` రేర్‌ రికార్డు..త‌క్కువ టైమ్‌లోనే ఆ ఫీట్ అందుకున్న బ‌న్నీ!

April 27, 2021 at 12:11 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో బ‌న్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల అల్లు అర్జున్ బ‌ర్త్‌డే(ఏప్రిల్ 7) నాడు పుష్ప‌రాజ్‌ను ప‌రిచ‌యం చేస్తూ ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ టీజ‌ర్ ఇప్పుడు ఏకంగా 50 మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్టి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. అది కూడా కేవ‌లం ఇర‌వై రోజుల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు బ‌న్నీ. దీంతో టాలీవుడ్‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో 50 మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్టిన టీజ‌ర్‌గా పుష్ప నిలిచింది. మ‌రి ఈ రికార్డ్‌ను ఎవ‌రో బ్రేక్ చేస్తారో చూడాలి.

`పుష్ప` రేర్‌ రికార్డు..త‌క్కువ టైమ్‌లోనే ఆ ఫీట్ అందుకున్న బ‌న్నీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts