కరోనా నుండి కోలుకున్న ప్రముఖ డైరెక్టర్..!?

April 28, 2021 at 3:28 pm

ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కొన్ని రాష్ట్రాలు కొన్ని ఆంక్షలతో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయగా, కర్ణాటక వంటి రాష్ట్రాలలో రెండు వారాల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ముఖ్యంగా పలువురు స్టార్ హీరోలు ఈ మహమ్మారి నుండి రక్షణ కోసం తమ ఇళ్లలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు.

అలాగే టాలీవుడ్ కి చెందిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ నెల 13న కరోనా బారిన పడ్డారు. కానీ అప్పటి నుండి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడడంతో తనకు ప్రస్తుతం నెగటివ్ వచ్చిందని, అలానే మన దేశంలో కొనసాగుతున్న ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన ఒక మీడియా ప్రకటన ద్వారా అనిల్ రావిపూడి ప్రజలను కోరారు.

కరోనా నుండి కోలుకున్న ప్రముఖ డైరెక్టర్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts