‘అణ్ణాత్త’ సినిమా షూటింగ్ రద్దు…!?

హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో రజినీకాంత్ నటిస్తున్న అణ్ణాత్త మూవీ షూటింగ్ జరుగుతోంది. గతంతో ఈ మూవీ యూనిట్‌ సభ్యుల్లో కొందరికి కరోనా రావటం, ఇంకా హీరో రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంతో ఈ మూవీ షూటింగ్‌ వాయిదా వేశారు. అయితే, గత పది రోజుల క్రితమే మళ్ళీ చిత్రీకరణ మొదలయింది. కానీ తెలంగాణాలో కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందడంతో అనేక చిత్రాల షూటింగ్‌లు వాయిదా వేస్తున్నారు.

ఈ క్రమంలో అగ్ర హీరోలు మూవీ షూటింగులను రద్దు చేశారు. ఇప్పుడు ఈ ప్రభావం రజనీకాంత్‌ అణ్ణాత్త మూవీ షూటింగ్‌ పై కూడా పడనుంది. రజనీకాంత్ అణ్ణాత్త మూవీ యూనిట్‌ కూడా అందరిలానే ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే, ఈ మూవీ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే, రజిని అణ్ణాత్త చీత్రీకరణ రద్దు పై ఆ మూవీ యూనిట్‌ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సివుంది.