ఏపీ ఇంటర్, 10వ పరీక్షల షెడ్యుల్ విడుదల…!

తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో భాగంగా 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర సర్కారు సెలవులు ప్రకటించింది. ఇకపోతే టెన్త్, ఇంటర్ విద్యార్థులు సంవత్సరాన్ని నష్ట పోకుండా ఉండేందుకు ఖచ్చితంగా పరీక్షలను నిర్వహించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ సర్కారు మరోసారి తన క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇకపోతే ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్ విధంగానే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. అయితే పదో తరగతిలో ఇదివరకు ఉన్న 11 పరీక్షలను ప్రస్తుతం 7 పరీక్షలకి కుదించిన సంగతి తెలిసిందే.

 

ఇది వరకు ప్రకటించిన పరీక్ష తేదీల ప్రకారం చూస్తే ఇంటర్ పరీక్షలు మే 5 నుండి 22 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి, అలాగే మే 5 నుండి మే 23 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అలాగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విధంగానే జూన్ 7న మొదలై జూన్ 14న ముగుస్తాయి. అయితే పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యాసంస్థల్లో విద్యార్థులు రావడంతో ఖచ్చితంగా పాఠశాల యాజమాన్యం కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని విద్యాశాఖ మంత్రి తెలియజేశారు.