ఏప్రిల్ 7,8 తేదీల్లో సెలవులు ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్‌..ఎందుకంటే?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో సెల‌వులుగా ప్ర‌క‌టించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

దీంతో ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు సెల‌వు ఉంటుంది. అలాగే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్ర‌భుత్వం అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఏప్రిల్ 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్ 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.