‘వకీల్ సాబ్’కు గుడ్‌న్యూస్‌..నెటిజ‌న్లు ఫైర్‌!

April 10, 2021 at 7:58 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక విడుద‌లైన ప్ర‌తి చోట పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. `వకీల్ సాబ్’ చిత్రానికి ఏపీలో అడ్డంకులు నెలకొన్న సంగ‌తి తెలిసిందే.

పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉన్న నేప‌థ్యంలో..వకీల్ సాబ్‌కి ఇవేమి లేవంటూ ఏపీలో అర్థరాత్రి అధికారులు కొన్ని జీవోలను జారీ చేశారు. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఇదంతా వైసీపీ ప్రభుత్వమే కుట్రపూరితంగా చేస్తుందని తీవ్రంగా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇక ఇదే స‌మ‌యంలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఈ విషయంపై ఏపీ హైకోర్టు‌ను సంప్ర‌దించ‌గా.. అక్క‌డ వ‌కీల్ సాబ్‌కు ఫేవ‌ర్‌గా తీర్పు వ‌చ్చింది. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ.. హైకోర్టు గుడ్ న్యూస్ చెబుతూ ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. మ‌రోవైపు ప‌లువురు నెటిజ‌న్లు ఏపీలో ప్రతీ పనికి కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించిందని.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.‌

‘వకీల్ సాబ్’కు గుడ్‌న్యూస్‌..నెటిజ‌న్లు ఫైర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts