డాటర్‌ ఆఫ్‌ సన్నీ గా శృతి హాసన్…!

కన్న తండ్రితో గొడవ పడి ముంబయ్‌ నుండి లండన్‌ వెళ్లిపోవాలనుకుంటున్నారట హీరోయిన్ శ్రుతీహాసన్‌ . ఏంటి నిజంగానా అని అనుకుంటున్నారా. ఇదంతా బాలీవుడ్‌లో శ్రుతీహాసన్‌ ఒప్పుకున్న కొత్త చిత్రం కథ అట. ప్యాడ్‌మ్యాన్‌, కీ అండ్‌ కా వంటి చిత్రాలను డైరెక్ట్‌ చేసిన ఆర్‌.

బాల్కీ దర్శకత్వంలో ఫాదర్‌ అండ్‌ డాటర్‌ రిలేషన్‌ షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం రూపొందనుందని బీ టౌన్‌ లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో శృతి తండ్రి పాత్రకు సన్నీ డియోల్‌నూ, కూతురు పాత్రకు శ్రుతీహాసన్‌నూ అనుకుంటున్నారట మూవీ యూనిట్‌. కథ ప్రకారం ముంబయ్‌లో ఉన్న కూతురు తండ్రితో కొన్ని విభేదాలు వచ్చి లండన్‌ వెళ్లిపోతుందట. ఆ తర్వాత తన తండ్రి పడే కష్టం గురించి తెలుసుకుని కూతురు ఎలా కన్విన్స్‌ అయ్యి వస్తుంది అనేదే బాల్కీ కథలో మెయిన్‌ పాయింట్‌ అట.