‘బతుకు బస్టాండ్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్..!

April 19, 2021 at 2:22 pm

టాలీవుడ్‌ లో ఇప్పటి దాకా మెగా ఫ్యామలీ నుంచే ఎక్కువ మంది హీరోస్ వచ్చారు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరోలు వస్తున్నారు. తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు విరాన్‌ ముత్తం శెట్టి. ఈ మధ్యనే అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్బంగా ఈ కుర్రహీరో తన మొదటి మూవీ ఫస్ట్‌ లుక్‌ ని విడుదల చేశాడు. బతుకు బస్టాండ్‌ పేరుతో వస్తోన్న ఈ చిత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఫుల్‌ మాస్‌ చిత్రంగా ఇది తెరకెక్కుతోందని గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది. ఐవీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ శేఖర్‌ మాస్టర్‌ డాన్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు. యెలేందర్‌ మహావీర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నికిత అరోరా, శృతిశెట్టి హీరోయిన్లుగా ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కవిత, మాధవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్‌ 11న బతుకు బస్టాండ్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బతుకు బస్టాండ్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts