ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!

April 12, 2021 at 12:13 pm

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`, ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్‌,అంజలి,అనన్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

విడుద‌లైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఈ క్ర‌మంలోనే ఒడిశాలోని గజపతి జిల్లా పరలఖేముండి పట్టణంలో ఉన్న‌ రెండు థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. దీంతో అక్క‌డున్న ప‌వ‌న్ అభిమానులు వ‌కీల్ సాబ్ చూసేందుకు పోటెత్తుతున్నారు.

దీంతో థియేటర్ల వద్ద భారీ రద్దీ ఏర్పడుతోంది. ముఖ్యంగా నిన్న ఆదివారం కావడంతో అభిమానులు తాకిడి మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న జిల్లా యంత్రాంగం వెంట‌నే.. క‌రోనా బంధనలను పాటించ‌నుందుకు థియేట‌ర్ల‌ను క్లోజ్ చేసేశారు. దీంతో.. ఆ రెండు థియేటర్లలో ‘వకీల్ సాబ్’ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.

ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts