కేసిఆర్ పై సెన్సేషనల్ కామెంట్లు చేసిన రాములమ్మ..!?

April 14, 2021 at 12:43 pm

టాలీవుడ్ నటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకు పడింది. కేసీఆర్ కి ఎప్పుడు దళిత బిడ్డల పై ప్రేమ లేదని ఆమె అన్నారు. బడుగు బలహీన వర్గాలను కెసిఆర్ ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని ఆమె కోపం వ్యక్తం చేసారు.తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

 

కేసీఆర్ పాలన త్వరలో పోవాలని, అందరికి న్యాయం జరగాలని విజయశాంతి కోరారు. కేసీఆర్, మంత్రులు ప్రజల్ని కుక్కలు అని సంబోధిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. తెరాస నేతల వార్నింగ్ లకు తాము ఎప్పుడు భయపడమని విజయశాంతి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారని, తప్పు చేస్తే రాళ్లతో కొట్టమని కేసీఆర్ ఏ గతంలో చెప్పారని, కేసీఆర్ కు త్వరలోనే ఆ పరిస్థితి వస్తుందని విజయశాంతి అన్నారు.

కేసిఆర్ పై సెన్సేషనల్ కామెంట్లు చేసిన రాములమ్మ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts