ఏపీలో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్..!?

వచ్చే సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ ని కూడా రాష్ట్రంలో తీసుకొస్తామని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్ చెప్పారు. జగన సర్కార్ వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కరోనా సమయంలా కూడా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.2,270 కోట్లు సహాయం చేస్తామన్నారు. విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, ఉన్నత చదువులే పిల్లలకు ఇచ్చే ఆస్తి అని జగన్ అన్నారు.

ప్రతి ఏటా రెండు వాయిదాల్లో జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద డబ్బు జమ చేస్తామని జగన్ తెలిపారు.విద్యా రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేద విద్యార్ధులు ఉన్నత విద్యకు దూరం కాకూడనే ఉద్దేశ్యంతో జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించామన్నారు.