కరోనా టెన్షన్లో చంద్రబాబు.. ఏమైందంటే ..??

April 12, 2021 at 12:05 pm

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు .గత వారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుని తరువాత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన చంద్రబాబు తిరుపతిలో ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ టీడీపీని గెలిపించాలంటూ కోరుతున్నారు.

కానీ ప్రస్తుతం తరుణంలో తిరుపతిలో కోవిడ్ కేసులు బాగా పెరుగుతూ ఉండటం పాటు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నాయకులకు కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి టిడిపి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. తాజాగా చంద్రబాబుతో కలిసి ఆయన శ్రీకాళహస్తిలో బహిరంగ సభలో పాల్గొన్నారు.ఆ టైములో చంద్రబాబు పక్కనే ఉన్న ఆయన మాస్కు కూడా పెట్టుకోలేదు. దీనితో చంద్రబాబుకి కరోనా వస్తుందేమో అని టెన్షన్ పట్టుకున్నట్లు టాక్.

.

కరోనా టెన్షన్లో చంద్రబాబు.. ఏమైందంటే ..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts