`వ‌కీల్ సాబ్‌`పై చిరు రివ్యూ..ఏమ‌న్నారంటే?

April 10, 2021 at 11:52 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌` చిత్రానికి ఇది రీమేక్‌. దిల్ రాజు, బోణి క‌పూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేత థామస్, అంజలి, అన‌న్య నాగ‌ల్ల‌, ప్రకాష్ రాజ్‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం నిన్న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

అయితే వ‌కీల్ సాబ్ విడుద‌లైన రోజే తమ్ముడి సినిమాను కుటుంబ స‌భ్యుల‌తో కలిసి వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు, తాజాగా సినిమాపై రివ్యూ కూడా ఇచ్చారు. `మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌వ‌న్ కల్యాణ్ మ‌ళ్లీ అదే వేడి, అదే వాడి, అదే ప‌వ‌ర్‌.. ప్ర‌కాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజ‌లి, అనన్య వాళ్ల పాత్ర‌ల్లో జీవించారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్, డీఓపీ వినోద్ ప్రాణం పోశారు.

దిల్ రాజుకి, బోనీ క‌పూర్ జీకి, డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ తో పాటు మిగ‌తా టీమ్ కి నా శుభాకాంక్ష‌లు. అన్నింటికీ మించి మ‌హిళ‌ల‌కి ఇవ్వాల్సిన గౌర‌వాన్ని తెలియ‌జేసే అత్య‌వ‌స‌ర‌మైన చిత్రం. ఈ వ‌కీల్ సాబ్ కేసుల‌నే కాదు.. అంద‌రి మ‌న‌సుల్నీ గెలుస్తాడు’ అని చిరంజీవి ప్ర‌శంస‌లు జ‌ల్లు క‌రిపించారు.

`వ‌కీల్ సాబ్‌`పై చిరు రివ్యూ..ఏమ‌న్నారంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts