ఎవ‌రెస్ట్ శిఖ‌రంపైనా క‌రోనా..!

క‌రోనా మ‌హ‌మ్మారి ఇటు క‌న్యాకుమారి నుంచి అటు అసేతు హిమాచ‌లం వ‌ర‌కూ విస్త‌రించింది. ప‌ట్ట‌ణాల‌ను, ప‌ల్లెల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న వైర‌స్ ఇప్పుడు ఏకంగా అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ పైకి కూడా పాకేసింది. కొవిడ్ 19 వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన ఓ వ్యక్తిని ఎవరెస్ట్ బేస్ క్యాంపులో అధికారులు గుర్తించారు. స‌ద‌రు వ్య‌క్తిని వెంటనే హెలికాఫ్టర్ ద్వారా ఖాట్మండులోని ప్రభుత్వ వైద్య‌శాల‌కు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే..

ఇదిలా ఉండ‌గా పర్వతారోహకుల్లో సాధారణంగా `పల్మనరీ ఎడీమా`, `కుంభ్`దగ్గు, `ఆల్టిట్యూడ్ సిక్‌నెస్`, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే తాజాగా క‌రోనా వెలుగుచూడ‌డం గ‌మ‌నార్హం. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఖాట్మాండు హాస్పిటల్‌లో టెస్ట్ చేయగా అతనికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బేస్ క్యాంప్‌లో మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక కరోనా విజృంభిన్నప్పటికీ పర్వతారోహణకు నేపాల్ ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయం కోసం పర్వాతారోహకుల ప్రాణాలతో ఆటలాడుతోందని పలు అంతర్జాతీయ పత్రికలు దుమ్మెత్తిపోస్తున్నాయి.