క‌రోనా టీకా విక‌టించి స‌ర్పంచ్ మృతి..!

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్‌-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్‌ 18న 1,033 మరణాలు సంభవించాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ.. కేసులు ఏమాత్రం తగ్గకపోగా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరగా.. మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. మ‌రోవైపు టీకా డ్రైవ్‌లో 11,44,93,238 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 3037 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. బుధ‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎనిమిది మంది బాధితులు మ‌ర‌ణించ‌గా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి. ఇందులో 1788 మంది బాధితులు వైర‌స్‌వ‌ల్ల మ‌ర‌ణించ‌గా, మ‌రో 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు.

మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా చేప‌డుతున్న‌ది. టీకాల పంపిణీ చేప‌ట్టింది. అయితే కరోనా టీకా వికటించి మృతి చెందిన మహిళ సర్పంచ్ ఇంటి వద్ద గ్రామస్థుల ఆందోళన చేప‌ట్టారు. జిల్లా కలెక్టర్ రావాలని డిమాండ్ చేయ‌డంతో పాటు గ్రామానికి వచ్చిన అధికారులతో వాగ్వివాదానికి దిగారు. రంగారెడ్డి జిల్లా కేశం పెట్ మండలంలోని లింగందనా గ్రామానికి చెందిన మహిళ సర్పంచ్ మయూరి కరోనా టీకా వికటించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల 12 వ తేదీన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ షీల్డ్ టీకా లను వేశారు అయితే టీకా తీసుకున్నాక టీకా వికటించి సర్పంచ్ మృతి చెందింది అయితే గ్రామానికి రంగారెడ్డి జిల్లా వైద్య అధికారులు గ్రామానికి చేరుకొని శాంపిల్ సేకరణ కోసం వచ్చినా సందర్భంలో వారితో వాగ్వాదానికి దిగారు జిల్లా కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలు డిమాండ్లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.