సీనియర్ హీరోయిన్ నగ్మాకు కరోనా పాజిటివ్..!

April 8, 2021 at 10:58 am

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజు దగ్గర దగ్గర లక్ష కేసుల వరకు భారతదేశంలో కొత్త కేసులు నమోదు ఉండడంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కోవిడ్ 19 టెస్ట్ లను చేస్తూ పాజిటివ్ గా వచ్చిన వారికి చికిత్స చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని అనేక మంది ప్రముఖుల కు కరోనా పాజిటివ్ టాక్ రావడంతో పాటు మరికొంతమంది మరణించడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే తాజాగా సినీ నటి కాంగ్రెస్ నేత అయిన హీరోయిన్ నగ్మా కరోనా వైరస్ బారిన పడింది.

తాజాగా ఆవిడే ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. కొద్ది రోజుల క్రితం తాను కరోనా వ్యాక్సిన్ మొదటి విడత చేయించుకున్నారని అయితే తాజాగా కొవిడ్ -19 టెస్టుకు హాజరు కాగా అందులో తనకు పాజిటివ్ గా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఫస్ట్ డోస్ తీసుకుంటామన్న ధైర్యంతో అవసరమైన మందులు తీసుకోకుండా ఉండవద్దని ఆవిడ తెలిపింది. ప్రస్తుతం నగ్మా ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్ పాటిస్తున్నట్లు తెలిపింది. ఇదివరకే ఆవిడ తన మొదటి కరోనా వ్యాక్షిన్ చేయించుకున్న తర్వాత ఎలాంటి అనుభూతి చెందిందో సోషల్ మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.

సీనియర్ హీరోయిన్ నగ్మాకు కరోనా పాజిటివ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts