దిల్‌రాజుకు క‌రోనా..ఆందోళ‌న‌లో చిరు అభిమానులు!

April 13, 2021 at 9:03 am

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా మ‌హ‌మ్మారి.. మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో రోజురోజుకు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరుగిపోతున్నాయి. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన‌ `వ‌కీల్ సాబ్‌` చిత్రాన్ని దిల్ రాజే నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వ‌కీల్ సాబ్ చిత్రం కోసం దిల్ రాజు జోరు ప్ర‌మోష‌న్స్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్స్‌, ఆడియన్స్‌ను క‌ల‌వ‌డం, థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం ఇలా ఎన్నో చేశారు. దాంతో ఈయనకు ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది.

Chiranjeevi - Dil Raju - Sriram Venu: వకీల్ సాబ్ దర్శక, నిర్మాతలైన దిల్ రాజు, శ్రీరామ్ వేణులను సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి.. | Megastar Chiranjeevi Appreciates Pawan Kalyan ...

ఇక ప్ర‌స్తుతం ఈయ‌న హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. దిల్ రాజుకు క‌రోనా సోక‌డంతో.. ఆయ‌న‌ను క‌లిసిన వారంతా టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఎందుకూ అంటే.. చిరు రెండు రోజుల క్రిత‌మే వకీల్ సాబ్ సక్సెస్ సందర్భంగా దిల్ రాజు, శ్రీరామ్ వేణులను స్వ‌యంగా సత్కరించాడు. అందుకే ఆయ‌న‌లో క‌ల‌వ‌రం మొద‌లైన‌ట్టు తెలుస్తోంది.

దిల్‌రాజుకు క‌రోనా..ఆందోళ‌న‌లో చిరు అభిమానులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts