గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ నిర్మాత మేన‌ల్లుడు ..!

April 7, 2021 at 2:41 pm

టాలీవుడ్ లో ప్రముఖ ప్రొడ్యూస‌ర్ అయిన దిల్ రాజు మేన‌ల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి అంతా రెడీ అయింది. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి రౌడీ బాయ్స్ అనే పేరును ఖరారు చేసిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల సమాచారం.

హుషారు ఫేం హ‌ర్ష ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. యూత్‌ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా కాలేజ్ గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్‌లో రానున్న ఈ ప్రాజెక్టులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫిమేల్ లీడ్ రోల్ చేయనుంది. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా, మ‌ధీ సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు, శిరీష్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరింత సమాచారం మూవీ గ్లింప్స్ వీడియో ద్వారా తెలియనుండేమో వేచి చూడాలి.

గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ నిర్మాత మేన‌ల్లుడు ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts