మార్వెల్ స్టూడియోస్ తో ఫర్హాన్ ప్రాజెక్ట్..?

April 8, 2021 at 3:50 pm

బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఇంకా ప్రజ్ఞాశాలి అయిన ఫర్హాన్ అక్తర్ ఇటీవలే ప్రఖ్యాత మార్వెల్ స్టూడియోస్ తో కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో ఉన్నారు ఫర్హాన్ అక్తర్. మార్వెల్ స్టూడియోస్ లో నిర్మితమైన ఐరన్ మాన్, యాంట్ మాన్, అవెంజర్స్ లాంటి సూపర్ హీరో చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందాయో అందరికి తెలిసిందే.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో ఫర్హాన్ అక్తర్ నటిస్తుండడం గొప్ప విశేషం. ఇక ఫర్హాన్ అక్తర్ నటించిన తాజా చిత్రం తూఫాన్ మే 21న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్ కీలక పాత్రల్లో నటించారు. తూఫాన్ మూవీ టీజర్ ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచేసింది.

మార్వెల్ స్టూడియోస్ తో ఫర్హాన్ ప్రాజెక్ట్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts