కాజ‌ల్ అలా చేస్తుంద‌ని ఊహించ‌లేదు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్‌!

April 16, 2021 at 8:34 am

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన కాజ‌ల్ ఇటీవ‌లె.. ప్రియ‌స‌ఖుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టింది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతోంది.

అయితే ఈమె న‌టిస్తున్న తాజా చిత్రాల్లో `ఘోస్టి` ఒక‌టి. ఎస్.క‌ళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు రెండు భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. కాజల్​ పోలీస్​ అధికారిగా క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో యోగిబాబు, ఊర్వశి, దేవదర్శిని, శ్రీమాన్​ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

చాలా త‌క్కువ స‌మ‌యంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్.. కాజ‌ల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. క‌ళ్యాణ్ మాట్లాడుతూ..`కథ వినగానే కాజల్ ఓకే చెప్పేశారు. చాలా త్వరగా షూటింగ్ ముగించేశాం. ముఖ్యంగా కాజల్ గురించి చెప్పాలి. మొదటిరోజు కాజ‌ల్ ఏ ఎనర్జీతో అయితే క‌నిపించారో.. షూటింగ్ లాస్ట్ డే వరకు అదే ఎనర్జీతో పనిచేశారు. ఆమె అలా చేస్తార‌ని ఊహించ‌లేదు.` అంటూ కాజల్ పనితనాన్ని కొనియాడారు.

కాజ‌ల్ అలా చేస్తుంద‌ని ఊహించ‌లేదు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts