శుభ వార్త : కరోనా వైరస్ కు హోమియోపతి వ్యాక్సిన్..!

April 16, 2021 at 1:03 pm

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న క్రమంలో దానికి చెక్ పెట్టేందుకు భారత్ మరో అడుగు వేసింది. హోమియోపతి వ్యాక్సిన్ తో కరోనాను తరిమేందుకు రెడీ అయింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కరోనా కట్టడికి హోమియో వ్యాక్సిన్ వాడలేదు. భారత్ మాత్రం ఇప్పుడు హోమియో టీకా ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ వ్యాక్సిన్ ని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా కంపెనీ తయారు చేసారు. ఈ వ్యాక్సిన్ 62 శాతం ప్రభావం చూపుతుందని ఆ సంస్థ అధిపతి డాక్టర్ రాజేష్ చెప్పారు.

వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో తమ సోనోడ్ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అన్నారు. క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయని, త్వరలోనే అందరికి ఈ వాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని హోమియో నిపుణులు అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్ లో రెండు టీకాలను ఇస్తున్నారు. తాజాగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. దీనికి సోనోడ్ కూడా తోడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా కొనసాగవచ్చు.

శుభ వార్త : కరోనా వైరస్ కు హోమియోపతి వ్యాక్సిన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts