బాల‌య్య కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన `క్రాక్‌` డైరెక్ట‌ర్‌?

April 16, 2021 at 8:33 am

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా..మే నెల‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ర‌వితేజ హీరోగా `క్రాక్‌` చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. యాదార్థ ఘటనల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్టింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. బాల‌య్య‌తో తీయ‌బోయే చిత్రాన్ని కూడా వాస్త‌వ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడ‌ట‌ గోపీచంద్.

అందుకోస‌మే, ఈయ‌న రీసెర్చ్ కూడా మొద‌లు పెట్టాడట‌. ఇటీవ‌లె గోపీచంద్ త‌న సొంత జిల్లా అయిన ప్రకాశంకు వెళ్లారు. అక్కడ ఉన్న జిల్లా లైబ్రెరీలో వేటపాలెం గ్రామానికి సంబంధించిన వందేళ్ల చరిత్ర గురించి పరిశోధనలు జరుపుతున్నారు. మ‌రి బాల‌య్య కోసం రీసెర్చ్ చేస్తున్న గోపీచంద్.. ఏ చ‌రిత్ర‌ను త‌వ్వుతారో చూడాలి.

బాల‌య్య కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన `క్రాక్‌` డైరెక్ట‌ర్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts