కరోనా భారిన పడిన మాజీ ముఖ్యమంత్రి..?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కుమారస్వామి ఈ రోజు ఉదయం ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ట్ చేసి చెప్పారు. తనను ఇటీవల కలిసిన అందరు కూడా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని కుమారస్వామి కోరారు. కర్ణాటక సీఎం యెడియూరప్ప కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యెడియూరప్పకు కరోనా బారిన పడటం ఇది రెండోవసారి.

కర్ణాటకలో నిన్న ఒక్కరోజే కొత్తగా 14,859 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 9,917 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 24 గంటల్లో కరోనాతో 78 మంది చనిపోగా, ఒక్క బెంగళూరులో 57 మంది ప్రాణాలు విడిచారు. కర్ణాటకలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,315. మొత్తం కేసుల సంఖ్య 11.24 లక్షలకు చేరుకోగా, మరణాల సంఖ్య 13,190కి చేరింది.

 

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”und” dir=”ltr”>I have tested positive for COVID-19. I request everyone who came in close contact with me over the last few days to isolate themselves and get tested.<br>ನನ್ನ ಕೋವಿಡ್-19 ಪರೀಕ್ಷೆಯ ವರದಿ ಪಾಸಿಟಿವ್ ಎಂದು ಬಂದಿದೆ. ಕಳೆದ ಕೆಲವು ದಿನಗಳಲ್ಲಿ ನನ್ನ ಸಂಪರ್ಕಕ್ಕೆ ಬಂದವರು ಕೋವಿಡ್ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಿ.</p>&mdash; H D Kumaraswamy (@hd_kumaraswamy) <a href=”https://twitter.com/hd_kumaraswamy/status/1383285989297168389?ref_src=twsrc%5Etfw”>April 17, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>