ఓవైపు హార్ట్ సర్జరీ..ఇంత‌లో అగ్ని ప్రమాదం..వైద్యులు ఏం చేశారంటే?

April 3, 2021 at 12:56 pm

తాజాగా ర‌ష్యాలో ఓ అద్భుత ఘ‌న చోటుచేసుకుంది. ఓ వ్యాక్తికి ఎనిమిది మంది వైద్యులు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేస్తుండ‌గా.. హాస్ప‌ట‌ల్‌లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. దాంతో అంద‌రూ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు బ‌య‌ట‌కు ఉరుకులు ప‌రుగులు పెట్టారు.

అయితే ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ఉన్న‌ వైధ్యులు అగ్ని ప్రమాద విషయం తెలిసినా కూడా ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. ఆ స‌మ‌యంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా రోగి ప్రాణాలు రిస్క్‌లో ప‌డ‌తాయి. అందువ‌ల్ల‌, వైద్యులు జంకకుండా, తడబడకుండా అత్యంత శ్రద్దతో ఆపరేషన్ ను పూర్తి చేశారు.

ఇంత‌లోనే అగ్ని ప్ర‌మాదం విష‌యం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది.. హుటాహుటిన అక్క‌డ‌కు చేరుకుని రెండు గంట‌ల పాటు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. దాంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక అగ్ని ప్ర‌మాదం విష‌యం తెలిసినా కూడా స‌ర్జ‌రీ పూర్తి చేసిన వైద్యుల‌పై అంద‌రూ ప్రశంస‌ల వ‌ర్షం క‌రిపిస్తున్నారు

ఓవైపు హార్ట్ సర్జరీ..ఇంత‌లో అగ్ని ప్రమాదం..వైద్యులు ఏం చేశారంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts