తెలంగాణ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియస్..!

April 19, 2021 at 3:16 pm

తెలంగాణ ప్రభుత్వం ‌పై హైకోర్టు తీవ్ర కోపం వ్య‌క్తం చేసింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరు ఆక్షేప‌నీయంగా ఉంద‌ని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణాలో జన సంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించింది. ఇక్క‌డ క‌రోనా స్థితిగతుల‌ పై సోమ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు థియేట‌ర్ల‌లో , బార్ల‌లో జనాల సంఖ్యని ఎందుకు త‌గ్గించ‌డం లేదంటూ ప్ర‌శ్నించింది.

పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమా అంటూఫైర్ అయ్యింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా వారే ఆదేశాలు ఇవ్వమంటారా అని హెచ్చరించింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మధ్యాహ్నంలోగా తెలపాలంటూ ఆదేశించింది. దీనికి సంబంధించిన అధికారులు న్యాయ‌స్థానంలో హాజ‌రు కావాల‌ని కూడా వారు ఆదేశించారు.

తెలంగాణ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియస్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts