ఏపీలో లాక్ డౌన్ పై జగన్ సంచలన ప్రకటన..?

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. మరో వైపు మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతున్న క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ పై మంగళవారం సీఎం నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగబోనుంది. ఈ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు జగన్ము సర్కార్. పదో తరగతి ప‌రీక్ష‌ల ర‌ద్దు, నైట్ కర్వ్ఫూ, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్ల‌కు సెల‌వుల ‌పై కీలక నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

ఇంకా దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది. బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు వినికిడి. మార్కెట్లు, దుకాణాల విషయంలో కొంత నిర్ణీత సమయం మాత్రమే తెరిచి ఉంచేలా ఆంక్షలు విధించనున్నట్లు జగన్ ఉన్నారని తెలుస్తోంది. వీటి పై రేపు మధ్యాహ్నం లోపు క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది.